ELR: ఏలూరులో అంగన్వాడీలు తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం కలెక్టరేట్ సమీపంలో ధర్నాకు దిగారు. ఈ మేరకు జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే రహదారి అంగన్వాడీలతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వము తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.