ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. మిస్డ్కాల్స్కు వాయిస్ మెయిల్ సదుపాయంతో పాటు మెటా ఏఐతో ఇమేజ్ క్రియేషన్, ఫన్నీ స్టేటస్ స్టిక్కర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త మీడియా ట్యాబ్ అందిస్తున్నట్లు వెల్లడించింది.