హైదరాబాద్‌ను శుభ్రంగా మార్చే లక్ష్యంతో GHMC ప్రతి సర్కిల్లో RRR (Reduce–Reuse–Recycle) సెంటర్లు ఏర్పాటు చేసింది. పాత బట్టలు, పుస్తకాలు, బొమ్మలు, పాదరక్షలు, ఫర్నిచర్, ప్లాస్టిక్లు వంటివి ఈ సెంటర్లకు తీసుకురావాలని పిలుపునిచ్చింది. నేరేడ్మెట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ సహా GHMC పరిధిలో అనేక చోట్ల వీటిని ఏర్పాటు చేశారు.