AP: ఫామ్‌హౌస్ పార్టీపై దువ్వాడ శ్రీనివాస్, మాధురి వివరణ ఇచ్చారు. ‘పార్ధు అనే వ్యక్తి పార్టీ అరేంజ్ చేశాడు. బిజినెస్ మీట్ పెడుతున్నాం రమ్మని అడిగారు. పార్టీ మొదలైన కాసేపటికే పోలీసులు వచ్చారు’ అని శ్రీనివాస్ వెల్లడించారు. ‘పోలీసులు వచ్చే వరకు పర్మిషన్ లేదని తెలియదు. మేము ఉన్న దగ్గర హుక్కా లేదు. పార్టీకి పిలిస్తే వచ్చామని పోలీసులకు చెప్పాం’ అని మాధురి వివరించారు.