AP: అల్లూరి జిల్లాలో ఘాట్ రోడ్లపై రాత్రివేళ భారీ వాహనాల ప్రయాణంపై అధికారులు నిషేధం విధించారు. ఘాట్ రోడ్లు, వంతెనలపై పొగమంచు పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లపై అన్ని రకాల భారీ వాహనాలు, హెవీ ప్యాసింజర్ వెహికల్స్ అనుమతించబోమని తెలిపారు. ఈ నియమాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.