KRNL: వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నగరూరు పాండు శుక్రవారం మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపి దళితులకు అన్యాయం చేసిందని తెలిపారు. ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పాండుకు సూచించినట్లు సమాచారం.