RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి సర్పంచ్ నరేందర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి అభినందనలు తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గెలుపుకు కష్టపడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.