ASF: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆమె శుక్రవారం జైనూర్ మండలంలో పర్యటించారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉందన్నారు.