నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సత్తవరం లక్ష్మీ కరుణాకర్ రెడ్డిని, వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఇంటింటికి తిరుగుతూ కోరారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలన్నారు.