RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం మక్తగూడ గ్రామ సర్పంచ్‌గా గెలిచిన శ్రీరాములు మొదళ్లగూడలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సన్మానించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తూ బీఆర్ఎస్ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలన్నారు.