SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 90 కేసుల్లో 1337 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు.