VKB: పరిగి నియోజకవర్గంలో గడిసింగాపూర్ నుంచి రంగారెడ్డి పల్లి వరకు జరుగుతున్న డబల్ రోడ్డు పనులను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాల్ పహాడ్ నుంచి చిట్టెంపల్లి వరకు కూడా డబల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.