ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. లక్నోలో ఈనెల 13 నుంచి జరిగే జాతీయస్థాయి SGF అథ్లెటిక్స్ పోటీల్లో చిన్నుబాయి, శాంతి, శరణ్య, అఖిల పాల్గొంటారని తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ లింబరావు, వ్యాయమ ఉపాధ్యాయులు మీనారెడ్డి పేర్కొన్నారు.