AP: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 2024లో 44,24,135 ఈ-చలాన్లు జారీ అయినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వీటి ద్వారా రూ.102.13 కోట్లు వసూలైనట్లు తెలిపారు. ఇంకా రూ.126.51 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 8.18 కోట్ల చలానాలు జారీ కాగా రూ.3,834 కోట్లు వసూలయ్యాయని, ఇంకా రూ.9,097 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు.