ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ. రామకృష్ణయ్య తెలిపారు. గతంలో 16,621 కేసులు పరిష్కరించామన్నారు. ఈసారి 42 ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేశారు. క్రిమినల్ రాజీపడదగిన కేసులు, మోటార్ క్లెయిమ్స్, చెక్‌బౌన్స్, ట్రాఫిక్ చలానాలు, సివిల్ వివాదాలు పరిష్కరించుకోవచ్చన్నారు.