TG: BRS హయాంలో పరిశ్రమల భూమిని నివాస భూమిగా మార్చారని జాగృతి అధ్యక్షులు కవిత ఆరోపించారు. ‘పోచంపల్లి ఫామ్‌హౌస్ కేసును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఛేంజ్ ఆఫ్ ల్యాండ్స్ జీవోల మీద మాజీమంత్రి కేటీఆర్ సంతకం పెట్టారు. హిల్ట్ పాలసీపై BRS ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది? అగ్నికి ఆజ్యం పోసిందే BRS. నా పదేళ్ల పదవీ కాలంలో ఎలాంటి తప్పు చేయలేదు’ అని పేర్కొన్నారు.