MNCL: బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగౌరవపరిచేలా కొందరు విగ్రహం ముందు చెత్తను వేస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు చెత్త వేయకుండా రక్షణగా ఏర్పాటు చేసిన సిమెంట్ పోల్ ధ్వంసం కావడంతో సమస్య మళ్లీ మొదలైంది. విగ్రహం ఎదుట చెత్త వేయకుండా అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని, విగ్రహ పవిత్రతను కాపాడాలని స్థానికులు పేర్కొన్నారు.