NTR: విజయవాడ కొత్త GGH సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సెంట్రల్ ఏసీ వ్యవస్థ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్, గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు సరైన గాలి కూడా అందడం లేదు. ఈ సమస్య కొన్ని నెలలుగా ఉన్నా, పరిష్కారం లభించడం లేదు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ చిన్నికి అధికారులు సమస్యను వివరించారు.