టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆంధ్ర తరఫున మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. తొలుత హర్ష్ గవాలిని 5 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత వరుస బంతుల్లో హర్‌ప్రీత్ సింగ్, రజత్ పటీదార్‌ను ఔట్ చేశాడు.