విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం మూడో గురువారం పూజలు అర్ధరాత్రి మొదలయ్యాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు తొలి పూజ చేశారు. అర్ధరాత్రే వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ ప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు.