SKLM: సీఎం సహాయనిధి నిరుపేద కుటుంబాలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి కి చెందిన కనిరెడ్డి హరికి సీఎం రిఫండ్ ద్వారా మంజూరైన రూ.4,77,247 చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే అశోక్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.