ATP: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్ నేడు ధర్మవరానికి రానున్నారు. ‘అటల్–మోదీ సుపరిపాలన యాత్ర’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. మంత్రి సత్యకుమార్ కుమార్తె సంస్కృతి పేరిట నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా 2 వేల మంది పదో తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.