HYD: ఫూట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఈనెల 13న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఫలక్ నుమా ప్యాలెస్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయనతో ఫొటో తీసుకునేందుకు ఒక్కొక్కరు రూ. 9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని ‘ది గోట్ టూర్’ నిర్వాహకులు తెలిపారు. కేవలం 100 మంది అభిమానులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.