NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్లో సంతమన్న జాతర సందర్భంగా మల్లన్న దేవాలయాన్ని బుధవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అయన మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అలాగే విశిష్ట పాదరసలింగాన్ని కూడా సందర్శించారు.