PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని స్వర్ణకార సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. నిన్న లక్ష్మీనగర్‌కు వచ్చిన ఎమ్మెల్యేను స్వర్ణకార సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా, బెంగాలీ వర్కర్ల కారణంగా స్థానిక స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.