NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది సంబరాలు చేసుకుంటున్న సమయంలో సర్పంచి తల్లి మృతి చెందింది. రుద్రూర్ మండలం రాణంపల్లి సర్పంచిగా కే. శంకర్ గెలుపొందాడు. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఆయన తల్లి లింగవ్వ ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.