శ్రీకాకుళంలోని ఫ్రెండ్స్ కాలనీలో మట్టి రోడ్డు గోతులమయంగా మారింది. నిత్యం ఈ మార్గాన వందలాది మంది ప్రయాణం సాగిస్తుంటారు. ఈ కాలనీలో సరైన రోడ్డుతో సహా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లల్లో వాడుతున్న వాడుక నీరు రోడ్డుపైనే నిలిచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు.