ATP: గుంతకల్లులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆదర్శనగర్ తాగునీటి కొళాయి వద్ద నీటి కోసం మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ అనే యువకుడు పై మరో వ్యక్తి వేట కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.