GDWL: మాచర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బుడకల వజ్రమ్మ 173 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. స్థానిక అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన వజ్రమ్మకు ప్రజలు అపూర్వ మద్దతు తెలిపారు. ఈ గెలుపు మాచర్లలో కొత్త మార్పుకు నాంది అని స్థానిక నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వజ్రమ్మ తెలిపారు.