కర్ణాటకలో ‘విందు’ రాజకీయం వేడెక్కింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిన్న అర్ధరాత్రి ఇచ్చిన విందు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీకి 30 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. విశేషమేమిటంటే.. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ కూడా ఇందులో పాల్గొన్నారు. దీంతో డీకే శివకుమార్ తర్వాతి స్కెచ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.