ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంపై డీజీసీఏ కొరడా ఝుళిపించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ‘ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ల’ను సస్పెండ్ చేసింది. విమాన భద్రత, ఆపరేషన్స్ చూడాల్సిన ఈ నలుగురు.. సరిగా పనిచేయలేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత విషయంలో రాజీపడేదే లేదని ఈ చర్యల ద్వారా డీజీసీఏ స్పష్టం చేసింది.