KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సీపీఎం బలపర్చిన అభ్యర్థిని వత్సవాయి పద్మ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే పద్మ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుతూ విజయోత్సవాలు నిర్వహించారు.