ADB: పంచాయతీ ఎన్నికల తొలి విడతలో భాగంగా నార్నూర్ మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో గురువారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయని ఎంపీడీఓ పుల్లారావు సూచించారు. మొత్తం 19, 359 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 7,962, మహిళలు 7,681 మంది ఓటు వేశారన్నారు. 80.80 శాతం పోల్ అవ్వగా 15,643 ఓట్లు నమోదయ్యాయని వెల్లడించారు. మండలంలో మిగితా 6 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.