VZM: కొత్తవలస జెడ్పీ పాఠశాల వద్ద ఉన్న వీరసాగరం నీరు ప్రవహించే కాలువను ఓ వ్యక్తి మట్టితో చదును చేసి సిమెంట్ పైపులతో మూసివేస్తున్నారు. ఇంఛార్జ్ తహసీల్దార్ పి. సునీతను సంప్రదించగా సంబంధిత విఆర్వోను పంపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద జలవనరులశాఖ ఏఈఈ కే. హనుమంతరావును వివరణ కోరగా వీరసాగరం కాలువ మూసివేతకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.