AP: రాష్ట్రంలోని పాస్టర్లకు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు విడుదల చేయాలని ఏపీ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అండ్ ప్రెసిడెంట్ బిషప్ జయప్రకాష్ కోరారు. ఈ మేరకు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. త్వరలో వేతనాల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.