టాలీవుడ్ నటుడు తిరువీర్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ ఆనందాన్ని తిరువీర్ వెరైటీగా పంచుకున్నాడు. బుజ్జాయి చిట్టి చేతిని పట్టుకుని.. ‘నాయినొచ్చిండు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. 2024లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇప్పుడు వారసుడు వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.