అన్నమయ్య: రామాపురం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బందితో పీగ్రెస్, రీసర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు అందజేశారు. తనిఖీ అనంతరం, రాయచోటి డివిజన్‌కు చెందిన 8 మండలాల 41 వెబ్ ల్యాండ్ మార్పుల దస్త్రాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.