E.G: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదం ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. చింతూరు–మారేడుమిల్లి సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందడం, 17 మంది గాయపడడం అత్యంత బాధాకరం అన్నారు. గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు సూచించారు.