విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి రవాణాను అరికట్టేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులను ప్రత్యేకంగా పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.