KMR: జిల్లాలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీబీపేట మండల కేంద్రంలో సాధ్విక-సాయినాథ్ విజయం సాధించారు. గురువారం రాత్రి ఓట్ల లెక్కింపు అనంతరం, ప్రత్యర్థిపై 1,300 మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఎంబీఏ పూర్తి చేసిన విద్యావంతురాలిగా ఆమె విజయం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.