AP: జాతీయ హస్తకళల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13న హస్తకళల్లో జాతీయ అవార్డులు సాధించిన ఐదుగురు కళాకారులను సన్మానించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. సంతోష్, శివమ్మ, శ్రీకృష్ణచరిత, హరనాథ్, అంజన్నలు అవార్డులు సాధించటంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో నిర్వహించే కార్యక్రమంలో మరో 100 మంది కళాకారులకు రూ.10 వేల చొప్పున విలువచేసే టూల్ కిట్లను అందించనున్నట్లు తెలిపారు.