BDK: బూర్గంపాడు మండలం ముసలి మడుగు గ్రామపంచాయతీలోని వాగులో ఓ గుర్తు తెలియని శవం తేలి ఆడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈరోజు ఉదయం అటుగా వెళుతున్న కొందరు యువకులు ఆ శవాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించినట్లు తెలిపారు. గుర్తులు నల్ల గీతల టీ షర్టు మెడలో పూసల తాడు ఉన్నట్లు గమనించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.