NGKL: వంగూరు మండలం చౌదరిపల్లి గ్రామంలో గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం సాధించారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.