W.G: నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15న ముహూర్తం ఖరారయింది. ప.గో. నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది.