ASR: కొయ్యూరు మండలం కితలోవ గ్రామానికి వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులకు గురై సరఫరా నిలిచిపోయిందన్నారు. సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సమస్య పరిష్కరించాలని కోరారు.