రష్యా ఆర్ధిక మూలాలపై ఉక్రెయిన్ దృష్టిపెట్టింది. కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక ఆయిల్ క్షేత్రంపై లాంగ్ రేంజ్ డ్రోన్ తో విరుచుకుపడింది. ఈ దాడిని ఉక్రెయిన్ నిన్న ధృవీకరించింది. రష్యాకు చమురు ద్వారా వచ్చే ఆదాయానికి గండి కొట్టడమే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. యుద్ధం కోసం రష్యా వాడుతున్న ఆర్థిక జీవనాడిని దెబ్బతీయడమే తమ ప్లాన్ అని స్పష్టం చేసింది. =