SKLM: వల్లంపూడి పోలీసు స్టేషన్ పరిధి రామస్వామిపేటలో పట్టపగలే బంగారం చోరీ జరిగింది. ఎస్సై సుదర్శన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బి. ఈశ్వరరావు, బార్య ఉదయం పొలం పనులకు వెళ్ళి మధ్యహ్నం ఇంటికొచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని 5 తులాల బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు. చోరీపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.