VZM: శృంగవరపుకోట మండల పరిధిలో కొంత మంది ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఆ భూములలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ డి. శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఆక్రమణదారులు హెచ్చరిక బోర్డులు తొలగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.