GNTR: తెనాలి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ తీసుకున్నారు. ఆయన సిఫార్సు మేరకు, 62 కిలోమీటర్ల మేర 27 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 36.63 కోట్లు మంజూరు చేసింది. ఈ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నిధుల మంజూరు పట్ల నియోజకవర్గ ప్రజలు మంత్రి మనోహర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.