KMM: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచార గడువు నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం వంటి 6 మండలాల్లో అభ్యర్థులు చివరి రోజు ఇంటింటి ప్రచారానికి పదును పెడుతున్నారు.